ప్రేమ ఎంత మధురమో.... చాక్లెట్అంత మధురం. మధురం అంటే తీపి అని తెలుసుగా... ప్రేమ ఎంత తియ్యనైనదో మీ వాలెంటైన్ కి తెలియజేయండి. తియ్యగా మాట్లాడటం అందరి వల్ల కాదు. కాబట్టి ఒక చాక్లెట్ ఇవ్వండి. మీ పార్ట్ నర్ మనసును తీపి చెయ్యండి. కచ్చితంగా తియ్యని మాటలు, తియ్యని నవ్వులు పుడతాయి. వాలెంటైన్ వీక్ లో 'చాక్లెట్ తో తియ్యని వేడుక చేసుకోండి.
చాక్లెట్ ఎందుకు?
తీపి పదార్థాలు దేవుళ్ల ఆహారము.. అందుకే అమృతం మధురంగా ఉంటుందని పూర్వం కవులు వర్ణించారు. అమృతాన్ని తయారు చేసుకోలేక పోయినా.. అమృతానికి ఉండే రుచి పట్టుకున్నాడు. మనిషి, అందుకే రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటున్నాడు. వాటిలో చాక్లెట్లు ప్రత్యేకం వాటిని చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కో బైట్ తింటున్న కొద్దీ ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి ముసలోళ్ల వరకు అందరి మనసును దోచేస్తుంది చాక్లెట్. అందుకే జీవితంలో ఏ విధమైన సంతోషం వచ్చినా ఆత్మీయులకు, స్నేహితులకు చాక్లెట్లతో శుభాకాంక్షలు తెలిపి ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు.
ఇంక లవర్స్ గురించి చెప్పిదముంది? అవకాశం దొరికిన ప్రతిసారీ చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటూ తీపి జ్ఞాపకాలను పోసుకుంటారు. కపుల్స్ తమ ఫీలింగ్స్ ని ప్రేమని, కేరింగ్ చాక్లెట్లతో షేర్ చేసుకుంటారు. ఈ చాక్లెట్లను కొంతమంది కృతజ్ఞుతకు గుర్తుగా ఇస్తుంటారు.
చాక్లెట్ నిజాలు
ఈ చాక్లెట్ ఇప్పటిది కాదు. క్రీస్తుపూర్వం 1900 నుంచి దీన్ని తింటున్నట్లు మెక్సికోలో ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే ఐర్లాండ్ వైద్యుడు హస్సీ స్లోన్ 17వ శతాబ్దంలో ఈ చాక్లెట్ ను ఆధునిక ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పుడు ఆయన జమైకాలో బ్రిటిష్ గవర్నర్ దగ్గర పనిచేసేవాడు . చేదుగా ఉండే కొకొవా తాగలేక ఒక రోజు దాంట్లో కొన్ని పాలు కలిపాడు. అప్పుడు దాని రుచే మారిపోయింది. తర్వాత ఆ మిశ్రమమే చాక్లెట్ గా తయారైంది. అంతకముందు కొకోవాసు వేడినీళ్లలో కలుపుకుని తాగే వాళ్లు.
స్విట్జర్లాండ్ లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 11 కిలోల చాక్లెట్లు తింటారట. పురుషులు ఆకలిగా ఉన్నప్పుడు కొవ్వు ఉప్పు పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తే... స్త్రీలు మాత్రం చాక్లెట్ వంటి తీపి పదార్థాలు తినడానికి ఇష్టపడతారట.
