న్యూఢిల్లీ: విదేశాల్లోని బ్లాక్ మనీని స్వదేశానికి రప్పించేందుకు ఇండియా చేస్తున్న పోరాటం ఫలిస్తోంది. బ్లాక్ మనీ దాచుకున్న వారి వివరాలు ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది. తొలి విడత కింద బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేసిన వారి వివరాలను ఇవ్వనుంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్విస్ బ్యాంకులు ఈ డేటాను ఇప్పటికే రెడీ చేశాయి. 2018 వరకు యాక్టివ్ లో ఉన్న బ్యాంకు అకౌంట్లు, వాటిల్లోకి వచ్చిన ఫండ్స్ వివరాలను ఇండియాకు ఇవ్వనున్నారు. విదేశాల్లో అక్రమంగా బ్లాక్ మనీ దాచుకున్నవారిపై విచారణకు ఈ డేటా ఉపయోగపడనుంది. వ్యాపారులు, ఎన్ఆర్ఐల బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. కొన్నేళ్లలో ఈ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డబ్బులు జమ అయ్యాయని, ప్రస్తుతం వాటిని మూసివేశారని వారు తెలిపారు. ఆటోమెటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవో) మెకానిజం ద్వారా ఇండియాకు వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. 2018కి ముందు మూసివేసిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి వందల కేసులు ఉన్నాయని, ఇండియన్ అధికారులు ఆధారాలు అందించడంతో ఈ వివరాలు ఇస్తున్నామన్నారు. గత నెల ఇండియాలో పర్యటించినస్విస్ ప్రతినిధులు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కు సంబంధించి ఇండియా వినతిని పరిగణలోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్సపరెన్సీ స్టాండర్డ్స్పాటిస్తున్నందునే పన్నులు ఎగ్గొట్టి బ్లాక్ మనీ దాచుకున్నవారిపై ఇండియా చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేస్తున్నామని స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్స్(ఎఫ్‌డీఎఫ్) తెలిపింది. తొలి విడత కింద అకౌంట్ నంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్, ఆదాయ వివరాలను అందిస్తామని ప్రకటించింది. ఏటా మరిన్ని వివరాలు ఇస్తామంది.
స్విస్ బ్యాంకుల డేటా వస్తోంది
- విదేశం
- September 9, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్‌పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్‌ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్‌టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ