తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజయం వెనక జెన్ జీ పాత్ర విస్మరించలేనిది. యువత ఓట్లు అన్నీ గంపగుత్తగా టీవీకే పార్టీకే పడ్డాయి. 234 నియోజకవర్గాల్లోనూ నన్ను చూడండి.. నన్ను చూసి ఓటు వేయండి అంటూ విజయ్ ఇచ్చిన పిలుపు కుర్రకారుకు బాగా ఎక్కింది. ఎంతలా అంటే.. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 12 లక్షల 50 వేల మంది మాత్రమే కాదు.. 35 ఏళ్ల వరకు ఉన్న అందరూ విజయ్ పార్టీకి ఓటేశారు.
ఎన్నికల ఫలితాల విజయ్ విజయ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జెన్ జీ వాళ్ల ఓట్లు వేయటమే కాదు.. ఇంట్లో పేరంట్స్, బంధువులు, ఫ్రెండ్స్ అందర్నీ బెదిరించి మరీ ఓటు వేయించారంట.
ఓటు లేని పిల్లలు సైతం.. మీ ఓట్లు విజయ్ పార్టీకే వేయాలంటూ ఇళ్లల్లో గొడవలు చేయటం, బెదిరించటం చేశారంట.
విజయ్ పార్టీకి ఓటు వేయకపోతే అన్నం తినను.. ప్రామిస్ చెయ్యి.. ఓటు వేస్తానని చెబితేనే అన్నం తింటానంటూ మారాం చేశారంట.
మరికొందరు అయితే విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారంట.
ఇంకొందరు కుర్రోళ్లు అయితే టీవీకే పార్టీకి ఓట్లు వేయకపోతే అన్నంలో విషం కలిపి అందర్నీ చంపుతానంటూ బెదిరింపులకు దిగారంట.
గ్రామీణ ప్రాంతాల్లోని విజయ్ ఫ్యాన్స్.. అభిమానులు అయితే తీవ్ర బెదిరింపులకు దిగారంట. ఇంట్లోనే ఓ గదిలో తనకు తాను నిర్బంధించుకోవటం.. ఓటు వేస్తానని ఒట్టు వేస్తేనే బయటకు వస్తాను అంటూ గొడవ చేయటం వంటివి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంకొందరు కుర్రోళ్లు అయితే గ్రామంలో టీవీకే పార్టీకి మెజార్టీ రాకపోతే గ్రామ పెద్దలపై దాడులు చేస్తాం.. వాళ్ల ఇళ్లపై దాడులు చేస్తాం అంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చారంట.
తమిళనాడులో హీరోగా విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. తలైపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో వేల్ఫేర్ అసోసియేషన్ ఉంది. 2009 నుంచి ఇది నడుస్తుంది. తమిళనాడు వ్యాప్తంగా 85 వేల అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు అన్నీ సామాజిక సేవ చేస్తూ ఉంటాయి. దీనికి అనిల్ అని పేరు పెట్టారు. అనిల్ అంటే ఉడత.. ఉడత సైన్యం అని పిలుస్తారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఈ 85 వేల అభిమాన సంఘాలు ఒక్కటి అయ్యాయి. నిరంతరం గ్రూపుల్లో చర్చించుకుంటుండే వాళ్లు.
ఈ క్రమంలోనే జెన్ జీ కుర్రోళ్లు.. ఓట్లు వేయించే బాధ్యతలో భాగంగా.. మొదటగా తల్లిదండ్రులు, బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ను నయానా, భయానా బెదిరించి మరీ ఓట్లు వేయించారు.
ఏదిఏమైనా విజయ్ పార్టీ గెలుపు గాలికి వచ్చింది ఏమీ కాదు.. 2009 నుంచే అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు అది విజయం సాధించింది. జెన్ జీ అనుకుంటే సాధించలేనిది ఏముందీ చెప్పండీ..
