హైదరాబాద్ను స్టార్టప్ క్యాపిటల్గా మారుస్తం

హైదరాబాద్ను స్టార్టప్ క్యాపిటల్గా మారుస్తం

యువ భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపేందుకు టీ హబ్ ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్లో స్టార్టప్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాయదుర్గంలో టీ హబ్ 2.0 ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేసీఆర్.. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్లు, ఎంట్రప్రెన్యూర్లకు ఉపయోగపడేలా స్టార్టప్ పాలసీ రూపొందించామని చెప్పారు. 

నేషల్ రోల్ మోడల్గా టీ హబ్ నిలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కలిసి పనిచేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడమే టీ హబ్ లక్ష్యమని అన్నారు. ఫేజ్ వన్ టీ హబ్ కన్నా రెండోది ఐదు రెట్లు పెద్దదని.. హైదరాబాద్ను స్టార్టప్ క్యాపిటల్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ ఇంక్యుబేటర్స్తో పోటీ పడే స్థాయిలో టీ హబ్ ఉందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్లు దోహదం చేస్తాయన్న కేసీఆర్.. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అభినందించారు.