డీప్టెక్ స్టార్టప్స్కు ‘బ్లూ ప్రింట్’..ఫండింగ్ నుంచి ఎదిగేదాకా టీహబ్ స్పెషల్ ప్రోగ్రామ్

డీప్టెక్ స్టార్టప్స్కు ‘బ్లూ ప్రింట్’..ఫండింగ్ నుంచి ఎదిగేదాకా టీహబ్ స్పెషల్ ప్రోగ్రామ్
  •     తొలి విడతలో భాగంగా 14 స్టార్టప్స్ ఎంపిక 

హైదరాబాద్, వెలుగు: డీప్​టెక్​రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. డీప్​టెక్​స్టార్టప్​లకు ఫండింగ్ నుంచి ఆ స్టార్టప్​లు ఎదిగేదాకా ప్రోత్సాహాన్నిచ్చేలా ‘బ్లూ ప్రింట్’ అనే 12 నెలల ఫౌండర్ ఫెలోషిప్​ప్రోగ్రామ్​ను అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమం తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 14 స్టార్టప్​లను ఎంపిక చేసింది. స్టార్టప్​లను ఏర్పాటు చేసే ఫౌండర్లకు బిజినెస్ ఆపరేషన్లు, మార్కెటింగ్, లీగల్​అంశాలపై పూర్తి అవగాహన కల్పించేలా ఈ బ్లూ ప్రింట్ ప్రోగ్రామ్ ద్వారా టీహబ్​జనరలిస్ట్​ సీఎక్స్​వో పాత్రను పోషిస్తోందని చెబుతున్నారు. 

ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రతి స్టార్టప్​కు12 నెలల బిజినెస్ ఆపరేటింగ్ ప్లాన్​ను రూపొందిస్తారు. ఫండ్ రైజింగ్ కోసం వెంచర్ క్యాపిటల్ పిచ్ డెక్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్, లీగల్ రికార్డులను పక్కాగా సిద్ధం చేయడంలో సహాయపడతారు. మార్కెట్ విస్తరణ, అంతర్జాతీయ అవకాశాలు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (పేటెంట్లు), నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్, నిధుల సమీకరణలో మెంటర్ల ద్వారా సహాయం అందించనున్నారు.  

టీహబ్ ఎంపిక చేసిన ఆ 14 స్టార్టప్​లు ఇవే..

క్రిష్నమ్, ఆర్టస్​ఏఐ, లైట్​మెడ్, జోధ్య, ఆర్కిల్​ఎనర్జీ, సెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెల్త్, వాహన్​, బిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైట్, సాన్యార్క్ ​స్పేస్ , సెమెక్స్ ఏఐ, పావక ఎనర్జీ, వెక్రాస్, పోర్టల్, స్టోరీవోర్డ్ వంటి స్టార్టప్​లను బ్లూ ప్రింట్ తొలి విడత ప్రోగ్రామ్​కు టీహబ్ ఎంపిక చేసింది. కాగా, ఇలాంటి స్టార్టప్​ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో రీసెర్చ్ డెవలప్​మెంట్​అండ్ ఇన్నొవేషన్ ఫండ్​ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. టెక్నాలజీ డెవలప్​మెంట్​బోర్డు ద్వారా వినూత్నమైన స్టార్టప్​లకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీనిపైనా స్టార్టప్​లకు టీహబ్ ద్వారా అవగాహన కల్పించనున్నారు.