V6 News

T20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా విజయం

T20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన T20 వరల్డ్‌కప్ 2021 లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్.. బంగ్లాదేశ్ టీమ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. బ్యాటింగ్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 73 పరుగులకే  ఆలౌట్ అయ్యింది. 74 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియా 6.2 ఓవర్లలోనే మ్యాచ్ ను ఛేదించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్  దూకుడుతో 8 వికెట్ల తేడాతో ఈజీగా విజయాన్ని అందుకుంది. స్పిన్నర్ ఆడమ్ జంపా  బౌలింగ్ దాటికి బంగ్లాదేశ్ 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఐదు వికెట్లు పడగొట్టిన ఆడమ్ జంపాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 గ్రూప్-1లో నాలుగో మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా.. మూడో విజయంతో పాయింట్ల పట్టికలోనూ రెండో స్థానానికి ఎగబాకి సెమీస్‌  అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. దక్షిణాఫ్రికా కూడా సమాన పాయింట్లతో ఆస్ట్రేలియాతో పోటిపడుతోంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.