టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియా టార్గెట్ 173

టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియా టార్గెట్ 173

టీ20 వరల్డ్ కప్ పైనల్ పోరులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దంచికొట్టాడు 48 బంతుల్లో 85 రన్స్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 173 టార్గెట్ ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు  మార్టిన్ గుప్తిల్ 28, మిచెల్ 11 పరుగులు మాత్రమే చేశారు. తర్వాత వచ్చిన  కెప్టెన్  కేన్ విలియమ్స్ 85 పరుగులతో రెచ్చిపోయాడు. పిలిప్స్ 18 పరుగులు చేయగా..  జాన్ నీషమ్ 13, టిమ్ సెఫర్ట్ 8 నాటౌట్ గా నిలిచారు.  ఆస్ట్రేలియా బౌలర్లలో  హజల్ ఉడ్  3 ,అడమ్ జంపా ఒక వికెట్ తీశారు.