బ్లర్‌‌‌‌ చిత్రంతో నిర్మాతగా మారిన తాప్సీ

బ్లర్‌‌‌‌ చిత్రంతో నిర్మాతగా మారిన తాప్సీ

హీరోయిన్‌‌గా వరుస కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తున్న తాప్సీ.. ‘బ్లర్‌‌‌‌’ చిత్రంతో నిర్మాతగా మారింది. పవన్‌‌ సోనీ కథను అందించగా అజయ్‌‌ బెహల్‌‌ డైరెక్ట్‌‌ చేశాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో గౌతమి, గాయత్రిగా డ్యూయెల్ రోల్ చేస్తోంది తాప్సీ. ట్రైలర్‌‌‌‌ ఫస్ట్‌‌ సీన్‌‌లోనే గౌతమి ఉరి వేసుకు చనిపోయినట్టు చూపించారు. తనది ఆత్మహత్యేనని తేల్చారు పోలీసులు. కానీ ఆమెను ఎవరో చంపేశారని బలంగా నమ్మిన గాయత్రి అసలు నిజం కోసం ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది.

నిజానికి తన చెల్లికి కళ్లు పూర్తిగా కనిపించవు. తనకేమో బ్లర్‌‌‌‌గా కనిపిస్తాయి. వెలుతురులో తిరిగితే ఆ కొద్ది చూపును కూడా కోల్పోతావని డాక్టర్ చెప్పడంతో కళ్లకు గంతలు కట్టుకుని తన అన్వేషణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తనను ఎవరో వెంబడిస్తుంటారు. ఫైనల్‌‌గా ఆమెకు తెలిసిన నిజం ఏమిటనేది అసలు కథ. తాప్సీ భర్తగా గుల్షన్‌‌ దేవయ్య కనిపించాడు. ట్రైలర్‌‌‌‌తో ఇంప్రెస్‌‌ చేసిన ఈ మూవీ డిసెంబర్‌‌‌‌ 9 నుండి జీ 5లో స్ట్రీమ్ అవబోతోంది.