ఇంటర్నెట్ తీగలు తెంచిన చైనా.. తైవాన్ కు ఇంటర్నెట్ సేవలు బంద్

ఇంటర్నెట్ తీగలు తెంచిన చైనా.. తైవాన్ కు ఇంటర్నెట్ సేవలు బంద్

చైనా ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. సరిహద్దు దేశాలపై తన ఆధిపత్యాన్ని చూపించడంకోసం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. చిన్నా దేశం, పెద్ద దేశం అనే తేడాలేకుండా గొడవలక దిగుతోంది. తాజాగా తైవాన్ తో మరొకసారి కయ్యానికి కాలు దువ్వింది. తైవార్ లోని మాట్సూ అనే ద్వీపానికి ఇంటర్నెట్ సరఫరా చేసే కేబుల్ వైర్లను చైనా పడవలు కత్తిరించాయి. 

దాంతో మాట్సూ ద్వీపం ఇంటర్నెట్‌ లేక నెలరోజులుగా ప్రపంచానికి దూరంగా  నిలిచిపోయింది. ఈ విషయాన్ని తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. చైనానే ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కత్తిరించిందని ఆరోపించింది. అయితే, ఈ విషయానికి సంబంధించి తమ వద్ద సరైన ఆధారాలు లేవని తైవాన్ అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ లేక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన మాట్సూ ప్రజలు పాత సాంకేతికత వ్యవస్థను వాడుతూ కొంత సమాచారాన్ని అందుకుంటున్నారు. ఇంటర్నెట్‌ లేక సమాచార వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తీవ్ర  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.