ఇండియాను దాటేసిన తైవాన్ స్టాక్ మార్కెట్

ఇండియాను దాటేసిన తైవాన్ స్టాక్ మార్కెట్
  • తైవాన్​ 4.95 ట్రిలియన్​ డాలర్లు.. మనది 4.92 ట్రిలియన్​ డాలర్లు

న్యూఢిల్లీ: తైవాన్​ స్టాక్ ​మార్కెట్​సైజ్​ ఇండియాను దాటేసింది. ఆ దేశం మార్కెట్ క్యాపిటల్​ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ క్యాపిటల్​ 4.92 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ బూమ్​తో  తైవాన్​కు చెందిన  ప్రపంచంలోనే అతిపెద్ద చిప్‌‌‌‌‌‌‌‌ మేకర్ టీఎస్ఎమ్​సీ షేర్లు ఈ ఏడాది 49 శాతం పెరిగాయి. దీంతో అక్కడి ఇండెక్స్​లు దూసుకెళ్తున్నాయి.

తైవాన్​ ప్రధాన సూచీలో ఈ ఒక్క కంపెనీ వాటానే 42 శాతం ఉంది. ఇండియా స్టాక్​ మార్కెట్ల నుంచి ఫారిన్​ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం, రూపాయి తగ్గుదల,  పెట్రో ధరల వల్ల  భారత మార్కెట్లు ఒత్తిడి  ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది స్టాక్​ మార్కెట్ల నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.04 లక్షల కోట్లు) ఉపసంహరించి తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు మళ్లించారు.