‘V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి

‘V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి
  • స్కూళ్లలో శానిటైజేషన్ ఫీజులపై హైకోర్టుకు లాయర్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్‌‌ స్కూళ్లు.. స్టూడెంట్ల నుం చి శానిటైజేషన్‌‌ ఫీజులు వసూలు చేస్తున్నాయని ‘వెలుగు’ దినపత్రిక రాసిన కథనాన్ని పిల్ గా తీసుకోవాలని లాయర్ చిక్కుడు ప్రభాకర్‌‌ హైకోర్టును కోరారు. మంగళవారం హైకోర్టు ప్రారంభం కాగానే ఈ విషయాన్ని చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన బెంచ్ ఎదుట లాయర్ ప్రస్తావించారు. ప్రైవేట్‌‌ స్కూల్స్‌‌.. స్టూడెంట్ల తల్లిదండ్రుల నుంచి అకడమిక్ ఫీజుతోపాటు అదనంగా రూ.300
నుం చి రూ.2 వేల వరకూ శానిటైజేషన్ కోసం వసూలు చేస్తున్నాయని చెప్పారు. స్టూడెంట్ల హెల్త్ కేర్ పేరిట ప్రైవేట్‌‌ విద్యా సంస్థలు ఈ విధమైన దోపిడీకి పాల్పడటాన్ని హైకోర్టు సుమోటో పిల్‌‌గా స్వీకరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెంచ్.. ‘వెలుగు’ కథనంలోని పూర్తి వివరాలను ఇంగ్లిష్
లోకి ట్రాన్స్‌‌లేట్‌‌ చేసి ఇస్తే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
ప్రైవేటు స్కూళ్లు రూల్స్ పాటిస్తలే
హైకోర్టు చెప్పి న మేరకు వెలుగు వార్తా కథనాన్ని ఇంగ్లిష్ లోకి ట్రాన్స్‌‌లేట్‌‌ చేసి చీఫ్‌‌ జస్టిస్‌‌కు ఇ-మెయిల్‌‌ చేసినట్లు లాయర్ చిక్కుడు ప్రభాకర్‌‌ మీడియాతో చెప్పారు. విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేట్‌‌ స్కూళ్లు ఉల్లంఘిస్తున్నాయని, జనవరి 12న సర్కారు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌‌కు అనుగుణంగా స్కూళ్లు వ్యవహరించట్లేదని వెలుగు పత్రిక కథనం రాసిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?

మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో బీజేపీ