సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే

సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే

సీఎం కేసీఆర్ చెబితే అది చట్టం చేసినట్టేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లాలో మొదటి విడతలో పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్ ల పంపిణి కార్యక్రమాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జదీశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నామన్నారు. గొర్రెలకు ఇన్సురెన్స్ కూడా అందిస్తున్నామన్నారు. సంచార పశువైద్య శాలలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ప్రతిపక్ష పార్టీల కుళ్లు రాజకీయాల్లో పడి కుల సంఘాలు ఆగమాగం కావొద్దన్నారు. టీఆర్ఎస్ అంటే ప్రతి ఒక్కరి పార్టీ… ప్రతి ఒక్కరి ఇంట్లో టీఆర్ఎస్ జెండా ఉంటుందన్నారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. గొర్రెల పంపిణీ పథకం గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. గతంలో తెలంగాణకు మాంసం దిగుమతులు వచ్చేవి.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు.

see more news

సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

కరోనా వ్యాక్సిన్ సంజీవని లాంటిది