ఆర్మూర్ ఎమ్మెల్యేకు ప్రశ్నలతో ఫ్లెక్సీలు.. జీవన్ రెడ్డి పర్యటనపై నిరసన

ఆర్మూర్ ఎమ్మెల్యేకు ప్రశ్నలతో ఫ్లెక్సీలు.. జీవన్ రెడ్డి పర్యటనపై నిరసన

ఆర్మూర్ ఎమ్మెల్యేకు ప్రశ్నలతో ఫ్లెక్సీలు
జీవన్ రెడ్డి పర్యటనపై నిరసన
ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్న ప్రజలు
నందిపేట మండలం తల్వెదలో ఏర్పాటు

నిజామాబాద్ : నందిపేట మండలం తల్వెద గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఏడు ప్రశ్నలను సంధిస్తూ గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాయకుడిని ప్రశ్నించాలి.. అడుక్కోకూడదు అంటూ మొదలు పెట్టారు. ప్రశ్నించే వారుంటేనే ప్రజాప్రతినిధులు మోసపుచ్చే వాగ్దానాలు చేయరంటూ ఎండ్ చేశారు.. 

ఫ్లెక్సీలో ఉన్న ప్రశ్నలు ఇవే.. 

1. రైతులకు రుణమాఫీ ఎక్కడ?
2. మా ఊరిలో దళిత బంధు లేదా?
3. బీసీ బందు అందరికీ ఎప్పుడు?
4. పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు ఎటుపాయే?
5. మన ఊరు మనబడి అంటివి పేద పిల్లల ఉసురుపోసుకుంటివి?
6. కొత్త బీడీ పింఛన్లు యాడికి పోయే?
7. కొత్త రేషన్ కార్డులు కొత్త పేర్లు నమోదు ప్రక్రియ యాడికి పోయే?