భార్యను నరికి చంపిన సినీ దర్శకుడు

భార్యను నరికి చంపిన సినీ దర్శకుడు

వివాహేతర సంబంధం నడుపుతుందన్నఅనుమానంతో భార్యను ముక్కలుగా నరికి చంపాడు ఓ భర్త. ఈ ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలకృష్ణన్ అనే తమిళ దర్శకుడు తన భార్య సంధ్య ను కత్తితో ముక్కలుగా నరికి చంపాడని పోలీసులు తెలిపారు. చెన్నై పెరుంగుడిలో జనవరి 21వ తేదీన డంప్ యార్డులో మనిషి తాలూకు శరీరబాగాలు కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. శరీరంపై ఉన్న టాటూ సహాయంతో చనిపోయిన వ్యక్తి బాలకృష్ణన్ భార్య సంధ్య అని నిర్దారించుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

సంధ్య.. సినిమాలలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపింది. ఈ విషయాన్ని తన భర్త బాలకృష్ణన్ తో పలు మార్లు చెప్పగా అందుకు అతను ఒప్పుకోలేదు. భర్తది సినిమా రంగం కావడంతో అతని దగ్గరకు వచ్చే వారితో చనువుగా ఉండేదని బాలకృష్ణన్ చెప్పాడు. ఈ విషయంపై పలు మార్లు హెచ్చరించినా భార్య నడవడికలో మార్పు రాలేదని… పైగా విడాకులు ఇస్తానని బెదిరించిందని  పోలీసు విచారణలో బాలకృష్ణన్ చెప్పాడు. దీంతో పాటే తన ప్రియుడితోనే ఉంటానని సంధ్య చెప్పడంతో.. బాలకృష్ణన్ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.