కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియంకు వ్యతిరేకంగా స్టాలిన్ తీర్మానం

కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియంకు వ్యతిరేకంగా స్టాలిన్ తీర్మానం

కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియం అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు అక్టోబర్ 9న రాష్ట్రపతికి సమర్పించిన నివేదికలోని... సిఫారసులను అమలు చేయవద్దని ఆయన తీర్మానం చేశారు. తమిళం సహా ఇతర భాషలు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం ఉందని ఆయన వ్యాఖ్యనించారు. కేంద్ర విద్యా సంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసిన నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

అంతకుముందు అక్టోబర్ 13న, కేంద్రం హిందీ అమలుకు వ్యతిరేకంగా అధికార డీఎంకే యువజన విద్యార్థి విభాగం తమిళనాడులోవ్యాప్తంగా నిరసనను చేపట్టింది. హిందీ భాష విషయంలో కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్టాలిన్.. గతంలో హిందీ భాష తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువకులు చేసిన త్యాగాలను తీర్మానంలో ప్రస్తావించారు. కేంద్రం మరోసారి భాషా యుద్ధానికి తెరలేపవద్దని కోరారు.