వదలని వరుణుడు.. 21 జిల్లాల్లో స్కూళ్లు బంద్

వదలని వరుణుడు.. 21 జిల్లాల్లో స్కూళ్లు బంద్

చెన్నై: తమిళనాడును వానగండం వదలడం లేదు. ఇప్పటికే భారీ వర్షాల వల్ల వరదలతో చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోసారి తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తుగా అక్కడి 21 జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణీపేట్, దిండుగల్, పుదుకొట్టై, నాగపట్నం, వేలూరు, తిరువరూర్‌తో సహా మరికొన్ని జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలను బంద్ చేశారు. భారీ వర్షాలు పడుతుండటంతో అలర్ట్ అయిన చెన్నై కార్పొరేషన్.. అధికారులతో కలసి వార్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సిటీలో పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తోంది. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.