త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు.. స్కూల్స్ కు సెల‌వు

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు.. స్కూల్స్ కు సెల‌వు

తమిళనాడులో వర్షాలు మొదలయ్యాయి. చెన్నై, దాని శివారు ప్రాంతాలలో రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జూన్ 19న ఉదయం సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

ట్రాఫిక్ కు అంతరాయం

దోహా, దుబాయ్‌లతో సహా దాదాపు 10 ఇన్‌కమింగ్ విమానాలను బెంగళూరుకు మళ్లించడంతో విమానాశ్రయంలోని అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఇది విమానాలు బయలుదేరడంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాహనం కదలికలు కుంటుపడ్డాయి.  

కొన్ని రోజులుగా నగరం, దాని సమీప జిల్లాలు ఎండ వేడికి అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కురుస్తోన్న జల్లులు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో వెల్లూరు, రాణిపేటతో పాటు చెన్నై, పొరుగు జిల్లాలైన చెంగల్‌పేట, కాంచీపురం, తిరువళ్లూరులోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. నగర శివారు ప్రాంతాల్లో జూన్ 19న వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.

https://twitter.com/ANI/status/1670643809859026944