సీఎం విజయ్పై బెదిరింపు వ్యాఖ్యలు డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

సీఎం విజయ్పై బెదిరింపు వ్యాఖ్యలు డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

చెన్నై: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్​పై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే జి.ఆర్. మార్కండేయన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్​ కావడంతో డీఎంకే కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. 

ప్రస్తుతం తూత్తుకుడి ఎస్పీ ఆఫీసులో పోలీసులు మార్కండేయన్​ను విచారిస్తున్నారు. జులై 18న జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మార్కండేయన్.. సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం మొదలైంది.