ఆస్కార్ విన్నర్కు కేర్‌టేకర్‌ బాధ్యతలు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆస్కార్ విన్నర్కు కేర్‌టేకర్‌ బాధ్యతలు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆస్కార్(Oscar) సాధించిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) లో నటించిన బెల్లి(Belli)ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి మహిళా కేర్‌టేకర్‌గా నియమించింది. నీలగిరి జిల్లాలోని తెప్పక్కడు ఏనుగుల శిబిరంలో మహౌట్‌కు సహాయక కావడీగా బెల్లిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం.. అనాధ ఏనుగుల పెంపకంలో బెల్లికి ఉన్న ప్రేమ, అంకితభావం, ఆదర్శప్రాయమైన సేవలను పరిగణంలోకి తీసుకొని ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది. ఇప్పటివరకు ఆమె ఏనుగులకు తాత్కాలిక కావడిగా  ఉండేది. ముదుమలైలోని తెప్పక్కడు ఏనుగు శిబిరం ఆసియాలోని పురాతన ఏనుగు శిబిరాల్లో ఒకటి. ఆ శిబిరంలోని ప్రతీ ఏనుగును అక్కడ గిరిజన సమాజానికి చెందిన ఒక మహౌట్, ఒక కావడి సంరక్షిస్తారు. 

ఇక ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ఇండియా నుండి ఉత్తమ డాక్యుమెటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ కి ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ఈ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మొదటి భారతీయ డాక్యుమెంటరీ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్.