
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. సాయిపల్లవి హీరోయిన్. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం ఆ సంస్థ భారీ మొత్తం వెచ్చించినట్టు సమాచారం. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ఐదు భాషల డిజిటల్ రైట్స్‌కు గాను ఏకంగా నలభై కోట్లు చెల్లిస్తోందట నెట్ ఫ్లిక్స్. నాగ చైతన్య కెరీర్‌లో ఇదే హయ్యస్ట్ డిజిటల్ డీల్. 2018లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దేశభక్తితో పాటు ప్రేమకథను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది.