తాండూరులో స్కూటీని ఢీకొట్టిన డీసీఎం..ఎస్సెస్సీ విద్యార్థి మృతి..మరో ఇద్దరు స్టూడెంట్స్పరిస్థితి విషమం

తాండూరులో స్కూటీని ఢీకొట్టిన డీసీఎం..ఎస్సెస్సీ విద్యార్థి మృతి..మరో ఇద్దరు స్టూడెంట్స్పరిస్థితి విషమం

తాండూరు, వెలుగు: వికారాబాద్​ జిల్లా తాండూరులో సిమెంట్​లోడ్​తో వెళ్తున్న డీసీఎం  స్కూటీని ఢీకొట్టడంతో  ఒక స్టూడెంట్​చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  తాండూరులోని ఎన్టీఆర్​కాలనీకి చెందిన విద్యార్థులు శేఖర్, గోవర్ధన్​పెద్దేముల్​మండలం గొట్లపల్లి మోడల్​స్కూల్​లో ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఎన్టీఆర్​కాలనీకే చెందిన సాత్విక్​(15)వీరిని స్కూటీపై స్కూల్​నుంచి ఇంటికి తీసుకువస్తున్నాడు. అంతారం సమీపంలోని బైపాస్​ రోడ్డు దగ్గర ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాత్విక్​అక్కడికక్కడే చనిపోయాడు. శేఖర్​, గోవర్ధన్​తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

వాకింగ్​కు వెళ్లి వస్తుండగా.. 

అంబర్ పేట్: వాకింగ్ కు వెళ్లి వస్తున్న ఓ వృద్ధుడిని ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు ఢీ కొనడంతో  చనిపోయాడు. అంబర్​పేట్​సీఐ టి.కిరణ్ కుమార్ కథనం ప్రకారం..కురుమ బస్తీకి చెందిన బట్టే  శ్రీరాములు(82) గురువారం సీపీఎల్​గ్రౌండ్ లో వాకింగ్ కు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. శ్రీ రమణ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బయోలాజికల్ కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీ రాములు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి..

మాదాపూర్: బైక్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో యువకుడు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్​పోలీసులు కథనం ప్రకారం..ఏపీలోని అనకాపల్లి జిల్లా బీఎల్ఎన్​పురానికి చెందిన పోలవరపు తేజస్​​(22) కొండాపూర్​ బిక్షపతినగర్​లోని ఓ హాస్టల్​లో ఉంటూ ప్రైవేటు జాబ్​చేస్తున్నాడు. బుధవారం రాత్రి రాయల్​ఎన్​ఫీల్డ్​బైక్​పై ఫ్రెండ్​మోహిత్​తో కలిసి హాస్టల్​నుంచి మాదాపూర్​మెటల్​చార్మినార్​వైపు వస్తున్నాడు. ఓవర్​స్పీడ్​లో ఉండడంతో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టాడు. తేజస్​ అక్కడికక్కడే చనిపోగా, మోహిత్​కు గాయాలయ్యాయి.