తారకరత్న ఆరోగ్యం విషమం...ఆస్పత్రికి బాలకృష్ణ

 తారకరత్న ఆరోగ్యం  విషమం...ఆస్పత్రికి బాలకృష్ణ

గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులు తారకరత్నను ఇవాళ పరామర్శించారు. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో  తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులెటిన్  విడుదల చేయనున్నారు.

జనవరి 27న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్‌ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్ఫత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్నకు ట్రీట్  మెంట్ కొనసాగుతోంది.