- ప్రధాన కార్యదర్శిగా అప్పాల అశోక్
హైదరాబాద్, వెలుగు : ప్రోగ్రెసివ్ మోడల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా తరాల జగదీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పాల అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ సలీం, రాష్ట్ర ఖజాంచీగా గుంటోజు నవీన్ కుమార్, మహిళా కార్యదర్శిగా విఠలాని శీతల్, మహిళా విభాగం కన్వీనర్‌గా లావణ్య, రాష్ట్ర కన్వీనర్‌గా అనుముల పోచయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా స్వామి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా తరాల జగదీశ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బకాయిలు, కారుణ్య నియామకాలు, ప్రమోషన్లు, టీజీటీల నోషనల్ సర్వీస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
