బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి: తరుణ్ ఛుగ్​

బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి: తరుణ్ ఛుగ్​

తెలంగాణలోక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ ఛార్జ్​ తరుణ్ ఛుగ్ కార్యకర్తలకు సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్   కైతలాపూర్ లో బీజేపీ కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని.. ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి తో కలసి ప్రారంభించారు. 

సీఎం కేసీఆర్, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజలు విసుగెత్తి మార్పు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. అధికారమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు.