పరీక్షల్లో సంస్కరణలపై టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్: మోదీ

పరీక్షల్లో సంస్కరణలపై టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్: మోదీ
  • టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ నివేదిక ఆధారంగా పరీక్షల విశ్వసనీయత పెంచేలా చర్యలు 
  • ‘ఎక్స్’ వేదికగా ప్రధాని వీడియో సందేశం 
  • సభ్యులుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో నలుగురు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్ 

న్యూఢిల్లీ: పరీక్షల నిర్వహణలో సంస్కరణలు ప్రవేశపెట్టి, ఎగ్జామ్స్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపర్చే దిశగా టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్  కోఫౌండర్ నందన్ నిలేకనీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం సాయంత్రం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.

‘‘మిత్రులారా.. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారు జైళ్లలో మగ్గుతున్నారు. మేం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశాం. రేపు పార్లమెంటులో కూడా కఠినమైన  నిబంధనలతో చట్ట సవరణ దిశగా ముందుకు వెళ్తున్నాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఎగ్జామ్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాతోపాటు పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

ఈ మేరకు తాము చేపట్టబోయే చర్యలను ప్రధాని తన వీడియోలో వివరించారు. ‘‘మనం భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మన పరీక్షా వ్యవస్థ నమ్మదగినదిగా, పారదర్శకంగా ఉండాలి. అలాగే మన పరీక్షా వ్యవస్థలో ఇప్పుడు టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించాలి” అని చెప్పారు.

‘‘ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణుడు నందన్ నిలేకనీ నాయకత్వంలో అత్యున్నత స్థాయి టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి పెడుతుంది. వీలైనంత త్వరగా, కమిటీ నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించే పని జరుగుతుంది’’ అని ప్రధాని తెలిపారు.

టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌లో ఉన్నది వీరే.. 
నందన్ నిలేకనీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌లో వివిధ రంగాలకు చెందిన డొమైన్ నిపుణులు ఐదుగురు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి. కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కవల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఉన్నారు.

వీరు దేశంలోని పరీక్షా వ్యవస్థలను మెరుగుపరచడంలో, ముఖ్యంగా టెక్నాలజీ కోణం నుంచి నిర్మాణాత్మక సంస్కరణల కోసం సహాయం చేస్తారు. కాగా, నిలేకనీ ఐఐటీ బాంబే నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ పాత్రలు పోషించిన అనుభవం ఉంది.

ఈగొవ్ (ఈ–గవర్నమెంట్) ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ ద్వారా పట్టణ పాలనను, పౌర సేవలను మెరుగుపర్చే మిషన్‌‌‌‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌‌‌‌గా సేవలందించారు.

మిలియన్ల మంది పిల్లలకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాసామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఏర్పాటైన ‘ఏక్‌‌‌‌స్టెప్ ఫౌండేషన్’ డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌కు కూడా నిలేకనీ కోఫౌండర్. టెక్నాలజీ రంగంలో విశేష సేవలకుగాను ఆయనను పద్మభూషణ్, జోసెఫ్ షుంపెటర్ ప్రైజ్‌‌‌‌తో సహా అనేక అవార్డులు వరించాయి.