కోఠి కాల్పుల కేసు..దొంగలు యూపీలో దొరికారు

కోఠి కాల్పుల కేసు..దొంగలు యూపీలో దొరికారు

హైదరాబాద్  కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగిన  కాల్పుల  కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను యూపీలో అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31 న  ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.  నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లో  ముమ్మరంగా గాలించి యూపీకి చెందిన ముగ్గురితో పాటు హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తిని నిందితులుగా గుర్తించి గాలించారు  టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏటిఎం దగ్గర  కాల్పులకు వాడిన వెపన్ ను కూడా రికవరి చేసుకున్నారు పోలీసులు. 

 యూపీకి చెందిన నిందితుడు A1 ఫరూక్ ఖాన్ ,  ఓ కేసులో కోర్టులో సరెండర్ అయిన యూపీకి చెందిన A2 ఫరూక్ , A3 అబిడ్ లు..నిందితులకు  షెల్టర్ ఇచ్చిన చాంద్రాయణగుట్టకు చెందిన A4 తయూబ్ పోలీసుల అదుపులో  ఉన్నారు.  ఎస్బిఐ దగ్గర  జరిగిన కాల్పుల ఘటనలో ఏ1, ఏ2 లు దోపిడీకి పాల్పడగా ఏ3 గా దోపిడికి ప్లాన్ వేశాడు.  ఏ4 గా ఉన్న తయుబ్ ఇద్దరు నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కేరళకు చెందిన రిన్షాద్ అనే  వ్యాపారి శనివారం (జనవరి 31) ఉదయం 7 గంటల ప్రాంతంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు కోఠి ఎస్‎బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఏటీఎమ్‎కు వెళ్లాడు. ఈ క్రమంలో రిన్షాద్  ను  ఫాలో అయిన  ఇద్దరు దుండగులు ముసుగు వేసుకుని వచ్చారు. ఏటీఎంలో డబ్బులు (రూ.6లక్షలు) డిపాజిట్ చేస్తుండగా రిన్షాద్ పై  కాల్పులు జరిపి డబ్బుతో ఉన్న బ్యాగ్ ను లాక్కెళ్లి బైక్ పై పారిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమరాలో రికార్డ్ అయ్యింది  .దుండగులు జరిపిన కాల్పుల్లో బాధితుడు రిన్షాద్ కాలులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గాలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.