హైదరాబాద్ లో మరో బిగ్ స్కాం..రూ. 3 కోట్ల నకిలీ యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం

హైదరాబాద్ లో  మరో  బిగ్ స్కాం..రూ. 3 కోట్ల నకిలీ యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం

 హైదరాబాద్ లో  కాదేదీ కల్తీకీ అనర్హం అన్నట్లు తయారయింది. తినే ఫుడ్ నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ నకిలీవి రాజ్యమేలుతున్నారు. వంటింట్లో వాడే మసాలల నుంచి వాడే సెల్ ఫోన్ వరకు నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. కొందరు కేటుగాళ్లు కాసులకు కక్కుర్తిపడి నకిలీ వస్తువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో  డూప్లికేట్ యాపిల్ యాక్సెసరీస్ ను భారీగా పట్టుకున్నారు పోలీసులు. 

ALSO READ | ఈ చాటింగ్ యాప్కు ఇంటర్నెట్ అవసరం లేదు.. బిట్ చాట్ గురించి తెలుసా..?

హైదరాబాద్ లో నకిలీ యాపిల్  యాక్సెసరీస్ స్కాంను చేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. యాపిల్ ప్రతినిధులతో కలిసి  మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రత్యేక ఆపరేషన్    చేసిన   హైదరాబాద్ టాస్క్ ఫోర్స్  పోలీసులు షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌ పురోహిత్ లను అరెస్ట్ చేశారు.   వీరి నుంచి రూ. 3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ యాక్సెసరీస్ ను స్వాధీనం చేసుకున్నారు. 

ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేసి యాపిల్ లోగో, స్టికర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్ చేస్తున్నారు.  అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నారు ఈ గ్యాంగ్.  భారీగా యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్‌బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు.  మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులను పట్టుకున్నారు. నిందితులను  మీర్ చౌక్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.