ఈ చాటింగ్ యాప్కు ఇంటర్నెట్ అవసరం లేదు.. బిట్ చాట్ గురించి తెలుసా..?

ఈ చాటింగ్ యాప్కు ఇంటర్నెట్ అవసరం లేదు.. బిట్ చాట్ గురించి తెలుసా..?

చాట్ చేయడానికి వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ ఇలా ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. అయితే, ఈ యాప్స్ పనిచేయాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ, ఇంటర్నెట్ లేకుండా చాట్ చేసే యాప్​ కూడా ఒకటి ఉంది. దానిపేరే బిట్ చాట్. ట్విట్టర్ కో– ఫౌండర్ జాక్ డోర్సే ఈ కొత్త మెసేజింగ్ యాప్​ను రిలీజ్ చేశారు. ఈ మెసేజింగ్ యాప్ ద్వారా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్​తో చాట్ చేయొచ్చు. దీనికి ఎలాంటి సర్వర్, నెట్​వర్క్​లతో పనిలేదు. పూర్తి ప్రైవసీ ఉంటుంది. బిట్​చాట్ మెసేజింగ్ ప్లాట్​ఫామ్ పూర్తిగా బ్లూటూత్​లో ఎనర్జీ నెట్​వర్క్​పై పనిచేస్తుంది. కాబట్టి సెల్యులార్ నెట్​వర్క్, వైఫై వంటివి అవసరం లేదు. నెట్ వర్క్ డౌన్ అయినప్పుడు, ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇంటర్నెట్ సర్వర్​లు పనిచేయని ప్రదేశాల్లో ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని ప్రూవ్ అయింది. దీనికి ఎలాంటి డాటాబేస్ అవసరం లేదు. యూజర్ పంపిన మెసేజ్​లు రిసీవ్ చేసుకునే వాళ్ల ఫోన్​లలో మాత్రమే స్టోర్ అవుతాయి. ఇది మామూలుగా 30 మీటర్ల దూరంలో బ్లూటూత్​ క్లస్టర్​ను క్రియేట్ చేస్తుంది. యూజర్ వేరొక చోటికి వెళ్తే అప్పుడు అది ఇతర హ్యాండ్ సెట్​లతో కనెక్ట్​ అయి క్లస్టర్​ను ఏర్పరుస్తుంది. దీనివల్ల మెసేజ్​ సెండ్ చేసిన వెంటనే బ్లూటూత్​ ప్రైమరీ లిమిట్ దాటి ఈజీగా షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

మరిన్ని వార్తలు