రసాయనాలతో మామిడి కాయల పక్వం

రసాయనాలతో మామిడి కాయల పక్వం
  • గోదాముల్లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
  • ఆసిఫ్ నగర్, టప్పాచబుత్రలో భారీగా మామిడి సీజ్

మెహిదీపట్నం, వెలుగు: కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గిస్తున్న గోదాములపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి కాయలను కొనుగోలు చేసి, ఐదు రోజులకు పండాల్సిన పండ్లను ఇథలిన్ రసాయనం ఉపయోగించి కేవలం ఒక్క రోజులోనే పక్వానికి తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆసిఫ్ నగర్ హుడా కాలనీలో జాన్ పాషా, అఖిల్ అలీ ఖాన్‌‌‌‌ నిర్వహిస్తున్న గోదాంలో 600 ట్రేలు, టప్పాచబుత్రలో జమీల్, ఫరీద్‌‌‌‌ వద్ద 350 ట్రేల రసాయన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంజిత్ తెలిపారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులపై కేసులు నమోదు చేసి గోదాములను సీజ్ చేశారు.