
మెహిదీపట్నం వెలుగు: చట్టవిరుద్ధంగా అర్ధరాత్రి వరకు ఓపెన్ చేసిన స్నూకర్ పార్లర్ పై సౌత్ అండ్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేసి కేసు నమోదు చేశారు. హుమయూన్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపిన ప్రకారం.. టోలిచౌకి మందార రెస్టారెంట్ పక్కన ఉన్న స్నూకర్ పార్లర్ అర్ధరాత్రి దాకా నడిపిస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి నిర్వాహకుడు పజిల్ ఖాన్ తో పాటు అక్కడ స్నూకర్ ఆడుతున్న 25 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.