పేదల ఇండ్లు కూల్చడం సరికాదు.. మూసీ తీరాన బస్తీ జనయాత్ర

పేదల ఇండ్లు కూల్చడం సరికాదు.. మూసీ తీరాన బస్తీ జనయాత్ర

మలక్​పేట, వెలుగు: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం సరికాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పని చేస్తున్నదని తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ (టీబీజేఏసీ) చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. మూసీ తీరాన బస్తీ జనయాత్ర పేరుతో శుక్రవారం చాదర్ ఘాట్ కమలా నగర్​లో ఆయన పర్యటించారు. గౌరెల్లి నుంచి గండిపేట్ వరకు ఉన్న 3వేల బస్తీల్లోని వేలాది మంది పేదలను నిరాశ్రయులను చేయాలని కాంగ్రెస్​ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.

యూపీలో బుల్డోజర్ పాలన గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి హైదరాబాద్​లో జరుగుతున్న కూల్చివేతలు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. తాము సుందరీకరణకు వ్యతిరేకం కాదని, అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం బస్తీవాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీరాములు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.