
మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆగష్ట్ 22 చిరంజీవి జన్మదినం కావడంతో చంద్రబాబు ట్విటర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ ఓ మెసెజ్ పోస్ట్ చేశారు. “స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేశారు.
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.#HBDMegaStarChiranjeevi pic.twitter.com/lwuH4ZgOzj
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2019