జనంలోనే వైసీపీ సంగతి తేలుస్తాం : బాలకృష్ణ

జనంలోనే వైసీపీ సంగతి తేలుస్తాం : బాలకృష్ణ

అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. ఈ పోరాటం, ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజల్లో పార్టీకి ఉన్న స్పందన చూసే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని బాలకృష్ణ చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. వెంకటపాలెంటలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీఎల్పీ నివాళి అర్పించింది.  ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే మరే అంశమైనా తీసుకోవాలన్నారు. 

 Also Read: 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

మరో వైపు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ కు  నిరసనకు ఆందోళన చేసిన  14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. 14  మంది సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య, చినరాజప్ప, వెంకట్ రెడ్డి నాయుడు,  గద్దె రామ్మెహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, శ్రీదేవి, అశోక్ సస్పెండ్ అయ్యారు.  కోటంరెడ్డి, అనగాని, పయ్యావులపై సెషన్ మొత్తం వేటు వేశారు.

ఇవాళ  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన  మొదటి రోజే.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. సభను అడ్డుకున్నారు., స్పీకర్ పోడియం ఎదుట ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.