కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ  ఎన్నికల కౌంటింగ్

మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ  ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సరూర్ నగర లోని ఇండోర్ స్టేడియంలో  కౌంటింగ్ జరుగుతోంది. స్టేడియం చుట్టూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.  మొత్తం 28 టేబుళ్లలో అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. అటు ఇప్పటికే సూపర్ వైజర్లు, అబ్జర్వర్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్నారు. తొలి రౌండ్లో ఫలితం తేలకపోతే రెండో రౌండ్ లెక్కింపు చేయడానికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంకా అన్ని ఏర్పాట్లు చేశారు.