హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా టీచర్లు సోమవారం నిరసనల్లో పాల్గొనాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ), టీచర్స్‌యూనియన్స్ జేఏసీ (జాక్టో) పిలుపునిచ్చాయి. ఉదయం ప్రార్థనా సమయం నుంచే టీచర్లు నల్లబ్యాడ్జీలతో విధుల్లో ఉండాలని, లంచ్ టైమ్ లో నిరసనలు చేయాలని ఆయా సంఘాల నేతలు చావ రవి, శ్రీనివాస్, రఘునందన్ కోరారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

