
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్, అమెచ్యూర్ గోల్ఫర్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించే గోల్ఫ్ రాండెవు ప్రొ–ఎఎమ్ లీగ్ హైదరాబాద్ లెగ్‌లో టీమ్ ఫెయిర్‌వేస్ విజేతగా నిలిచింది. కెప్టెన్ శ్రీధర్ అనంతరెడ్డి, అదిత్ అహ్లూవాలియా, విశేష్ శర్మ, మహమ్మద్ అజార్, సంకీర్త్ నిడదవోలు, రిషబ్ సింగ్, ఆకర్ష్ గౌడ్, వేదాంష్ రావుతో కూడిన ఈ జట్టు లీగ్‌లో టాప్ గోల్ఫర్‌లున్న ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీనిచ్చి విజయం సాధించింది.
ఈ సీజన్ ఆద్యంతం పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన ఫెయిర్‌వేస్ మొత్తం 560 పాయింట్లతో హైదరాబాద్ లెగ్‌లో విన్నర్‌గా అవతరించింది. దాంతో థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయిలో జరిగే ఇంటర్నేషనల్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఫైనల్ విన్నర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది.