
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత్ తన రెండో లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇండియాకు శుభారంభం అందించారు. 15 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 75 రన్స్ చేసి .. పరుగుల వేట కొనసాగిస్తున్నారు. ఓవర్ కు 5 పరుగుల రన్ రేట్ తో పరుగులు సాధిస్తున్నారు. తొలి మ్యాచ్ లో విఫలమైన ధావన్.. బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు.