50 రన్స్ కే ఐదు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

50 రన్స్ కే ఐదు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

కాన్పూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ డకౌట్ గా వెనుదిరగ్గా.. కెప్టెన్ రహానె (4) కూడా నిరాశ పర్చాడు. క్రీజులో కుదురుకుంటున్న సమయంలో మయాంక్ అగర్వాల్ (17), ఛటేశ్వర్ పుజారా (22) ఔటవ్వడం టీమిండియాను దెబ్బతీసింది. ఆదుకుంటాడనుకున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (0)ను టిమ్ సౌతీ పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం మెన్ ఇన్ బ్లూ స్కోరు 83/5. రవిచంద్రన్ అశ్విన్ (20 బ్యాటింగ్), శ్రేయాస్ అయ్యర్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. అశ్విన్, అయ్యర్ జోడీ క్రీజులో ఎంతసేపు ఉంటారనే దాని మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడింది. ఈ ఇద్దరూ మరిన్ని పరుగులు జోడిస్తే భారత్ కు విజయావకాశాలు ఉంటాయి లేదా కివీస్ కు సిరీస్ లో బోణీ కొట్టడం పెద్దగా కష్టం కాకపోవచ్చు.