న్యూఢిల్లీ: గాయం కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ మొత్తానికి దూరమైన తమ ఆల్‌రౌండర్, శ్రీలంక స్టార్ క్రికెటర్ వానిందు హసరంగ స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన జార్జ్ లిండేను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకుంది. వేలంలో హసరంగ రూ. 2 కోట్లకు లక్నోకు ఎంపికవగా.. అతని స్థానంలో వచ్చిన 33 ఏండ్ల లిండే తన బేస్ ప్రైస్ రూ. 1 కోటికి జట్టులో చేరనున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ అయిన లిండేకు 250కి పైగా టీ20లు ఆడిన అనుభవం ఉంది.
