రాజకీయ లబ్ధి కోసమే.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్

రాజకీయ లబ్ధి కోసమే.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్
  • కేంద్రం తెచ్చే డీలిమిటేషన్ సవరణతో తీవ్ర పరిణామాలు
  • కేంద్రంపై సీడబ్ల్యూసీ మీటింగ్ లో పార్టీ చీఫ్ ఖర్గే కామెంట్స్ 
  • 50 శాతం లోక్​సభ, అసెంబ్లీ సీట్ల పెంపుతో పలు రాష్ట్రాలకు అన్యాయం
  • సీడబ్ల్యూసీ మీటింగ్​లో పార్టీ చీఫ్ ఖర్గే కామెంట్స్ 
  • రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, సీడబ్ల్యూసీ మెంబర్ల హాజరు 
  • సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న కర్నాటక, హిమాచల్ సీఎంలు

న్యూఢిల్లీ, వెలుగు:కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసమే మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా అంశాలపై ఈ నెల 16 నుంచి ప్రత్యేక సెషన్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైందని, అయితే దీనిపై ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారిక ప్రతిపాదన రాలేదన్నారు. ప్రధాన మంత్రి రాసిన వ్యాసం ద్వారానే త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొన్ని విషయాలు తెలిశాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. 

అయితే, ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కోరామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఇందుకోసం ప్రతిపక్ష నాయకులు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి మూడుసార్లు లేఖలు రాసినా స్పందించలేదని చెప్పారు. త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోలేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఖర్గే పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖర్గే అధ్యక్షత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. 

ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (వర్చువల్ గా), రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేష్ బఘేల్ ఇతర కీలక నేతలు, సీడబ్ల్యూసీ మెంబర్లు హాజరయ్యారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ సమావేశంలో పాల్గొన్నారు.

 ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలు దేశ ఎన్నికల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లాభం పొందాలని కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును అత్యంత వేగంగా ఆమోదించాలని చూస్తోందన్నారు. అదనంగా లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ సీట్లను 543 నుంచి 816 కు పెంచాలని యోచిస్తోందన్నారు.  

హైదరాబాద్ మీటింగ్​లోనే స్పష్టత ఇచ్చాం..

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఖర్గే స్పష్టం చేశారు. 2023లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్లపై స్పష్టతని ఇచ్చామన్నారు. అలాగే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను డిమాండ్ చేశామని గుర్తు చేశారు. 2023 సెప్టెంబర్ 23న రాజ్యాంగ సవరణ బిల్లుపై మాట్లాడిన సందర్భంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సభలో డిమాండ్ చేశానన్నారు. 

ఆనాడు జనగణన, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అని తప్పించుకున్న బీజేపీ.. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న వేళ హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు సవరణ, పునర్విభజన చట్టం సవరణ బిల్లులను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఈ సవరణలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందిస్తామని, అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుతామని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మోదీ ప్రభుత్వానికి కొత్తేమీ కాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని దుయ్యబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టారు.