మహిళను చంపి.. రేప్ చేసిన 19 ఏళ్ల యువకుడు

V6 Velugu Posted on Sep 17, 2021

రాజస్థాన్‌: దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. మార్పు రావడంలేదు కదా.. కనీసం శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనే అందుకు ఉదాహరణ. హనుమాన్‌గఢ్‌లోని పిలిబంగా పట్టణంలో ఓ 60 ఏళ్ల మహిళపై అత్యాచార యత్నం విఫలం కావడంతో.. ఆమెను హత్య చేసి రేప్ చేశారు. పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో ఓ 60 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బాలుడు ఆమెను కొట్టి చంపాడు. అంతటితో ఆగకుండా.. మృతదేహంతో తన కామవాంఛ తీర్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

Tagged rajasthan, Rape, rape and murder, Hanumangarh , Pilibanga, rape on deadbody

Latest Videos

Subscribe Now

More News