కాంగ్రెస్ కు మద్దతిస్తా..! : మల్లారెడ్డినా మజాకా

కాంగ్రెస్ కు మద్దతిస్తా..!  : మల్లారెడ్డినా మజాకా

హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీ ఆవరణ అంతా నాయకులతో సందడిగా మారింది. ఇక్కడే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే.. ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి నవ్వుతూ అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్‌కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా.. కచ్చితంగా ఇస్తానని బదులిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తర్వాత అందరం ఒక్కటేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.