100 కేసులు పెట్టినా కేసీఆర్ ను ఎదుర్కొంటా 

100 కేసులు పెట్టినా కేసీఆర్ ను ఎదుర్కొంటా 

CM కేసీఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు తీన్మార్ మల్లన్న. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని..  100 కేసులు పెట్టిన ఎదుర్కొంటామన్నారు. సిసిఎస్ సైబర్ క్రైమ్ ఆఫీస్ లో విచారణకు హాజరైన తీన్మార్ మల్లన్న ..పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని..పోలీసులు సరైన విచారణ చేయాలన్నారు. కేసీఆర్ సక్కగా పరిపాలన చేస్తే ఎవరు ప్రశ్నించరన్నారు.

సుప్రీంకోర్టు అనవసరంగా కేసులు పెట్టొద్దని చెప్పిందని... పోలీస్ స్టేషన్లు ప్రజలను వేధించే కర్మాగారాలుగా మారాయని సుప్రీం తెలిపిందని గుర్తు చేశారు తీన్మార్ మల్లన్న. కోర్టు మొట్టికాయలు వేసిన కేసీఆర్ మారడం లేదన్నారు... ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు.