- రేపు జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీల నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, ప్రముఖ విద్యా సంస్థల యూనివర్సిటీ స్టూడెంట్లతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్ పీ) ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమావేశం కానున్నారు. అదేవిధంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ‘మీ ప్రశ్నకు మా సమాధానం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శనివారం టీఆర్ పీ రాష్ర్ట కార్యాలయంలో మల్లన్న అధ్యక్షతన రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మొత్తం 4 తీర్మానాలు చేశారు. ముఖాముఖితో పాటు మీ ప్రశ్నకు మా సమాధానం కార్యక్రమాలు ఖరారు చేశారు. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శల ఎంపిక కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్లు రాగా వీటిని రాష్ర్ట కార్యవర్గం పరిశీలించింది. ఈ నెల 27న జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల తొలి జాబితాను రిలీజ్ చేయాలని కార్యవర్గంలో నిర్ణయించారు. కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తటస్థంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ పీ ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది.
