
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో తెహెల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారాల్లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 2001లో తన పత్రికలో తేజ్‌పాల్ ఓ కథనం ప్రచురించారు. దీంతో అహ్లూవాలియా పరువు నష్టం దావా వేశారు. అహ్లూవాలియాపై ఆరోపణలను పత్రిక నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని తేజ్‌పాల్, మరో ఇద్దరు రిపోర్టర్లను హైకోర్టు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.