ధర్మశాల/చెన్నై: దుబాయ్ఎయిర్షోలో ప్రాణాలు కోల్పోయిన తేజస్జెట్పైలెట్, వింగ్కమాండర్నమాన్ష్శ్యాల్అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా పతియాల్కర్ఆయన స్వగ్రామం. శుక్రవారం ఎయిర్‌షోలో నమాన్ష్చనిపోయారన్న వార్త తెలిసి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నమాన్ష్ తండ్రి జగన్నాథ్ శ్యాల్, తల్లి వీణ. రిటైర్డ్ప్రిన్సిపాల్అయిన జగన్నాథ్ శ్యాల్.. టీచింగ్ఫీల్డ్లోకి వచ్చే ముందు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.
35 ఏండ్ల నమాన్ష్‌కు 2014లో పెండ్లయింది. ఆయనతోపాటు ఆయన భార్య అఫ్షాన్కూడా ఇండియన్ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో పనిచేస్తున్నారు. వీరికి ఏడేండ్ల కూతురు ఆర్య ఉంది. సొంత రాష్ట్రం హిమాచల్‌లోని హమీర్పూర్ సైనిక్ స్కూల్లో నమాన్ష్విద్యాభ్యాసం సాగింది. ఆయన అథ్లెట్కూడా. విధి నిర్వహణలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో భార్య, బిడ్డతో కలిసి నమాన్ష్ ఉంటున్నారు. నమాన్ష్భార్య ట్రైనింగ్‌కోసం ఇటీవల కోల్‌కతాకు వెళ్లింది.
దీంతో పాపను చూసుకునేందుకు రెండువారాల కిందట్నే నమాన్ష్ తల్లిదండ్రులు స్వగ్రామం హిమాచల్‌లోని పతియాల్కర్ నుంచి కోయంబత్తూర్‌కు వచ్చారు. ‘‘నేను శుక్రవారం ఉదయం నా కొడుకుతో ఫోన్లో మాట్లాడాను. దుబాయ్ ఎయిర్‌షోను టీవీలో కానీ, యూట్యూబ్‌లో కానీ చూడండని వాడు చెప్పాడు. సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్‌లో ఎయిర్ షో గురించి వెతుకుతుంటే.. విమానం కూలిందన్న వార్త కనిపించింది.
వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవడానికి మా కోడలికి ఫోన్ చేశాను. ఆమె ఎయిర్ఫోర్స్ఆఫీసర్. ప్రస్తుతం కోల్‌కతాలో శిక్షణ తీసుకుంటున్నది. నేను మా కోడలికి ఫోన్ చేస్తుండగానే.. ఆరుగురు ఎయిర్ఫోర్స్సిబ్బంది మా ఫ్లాట్‌కు వచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది.. మా బాబుకు ఏదో జరిగిందనీ” అంటూ జగన్నాథ్శ్యాల్కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, నమాన్ష్పుట్టిపెరిగిన పతియాల్కర్లో తీవ్ర విషాదం అలుముకున్నది.
శుక్రవారం తేజస్ జెట్కూలిన విషయం తెలిసి తన అన్న జగన్నాథ్ శ్యాల్కు ఫోన్‌చేశానని.. అప్పటికీ ఆ విషయం ఆయనకు తెలియదని పతియాల్కర్వాసి, నమాన్ష్ చిన్నాన్న జోగీంద్రనాథ్ శ్యాల్ తెలిపారు. ఆదివారం స్వగ్రామానికి నమాన్ష్ భౌతిక కాయం వస్తుందని, అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
