పాట్నా: బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తేజస్వీ యాదవ్ ఎన్నికయ్యారు. సోమవారం పాట్నాలోని తేజస్వీ నివాసంలో ఆర్జేడీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ప్రతిపక్ష నాయకుడిగా తేజస్వీ యాదవ్ ను ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ కూటమి ఘోర పరాజయంపై చర్చించారు.
ఓటమికి గల కారణాలను ఎమ్మెల్యేలు సమీక్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే 10% (25) సీట్లలో గెలుపొందాలి. ఆర్జేడీ సరిగ్గా 25 సీట్లలోనే గెలవడం విశేషం.
