
ఈ నెల 27 న జరగాల్సిన స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పలు రాజకీయ పార్టీలు ఓట్ల లెక్కింపును వాయదా వేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశాయి. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఈసీ కౌంటింగ్ తేదీని వాయిదా వేసింది. కౌంటింగ్ తేదీని జూన్ 3 వ తేదికి వాయిదా వేసింది.