రాష్ట్రంలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు కేసులు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు అయ్యాయ‌ని తెలిపింది. ఈరోజు 40 మందిని డిశ్చార్జ్ చేసినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. సోమ‌వారం నమోదైన మూడు కేసుల‌తో క‌లిపి ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085 కి చేరింది. అయితే ఇందులో 585 మందిని డిశ్చార్జ్ అయ్యారు. 471 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 29 మంది క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించారు.

Telangana: 3 new corona cases registered in last 24 hours.