ఎల్బీనగర్, వెలుగు : భూసర్వే, జాయింట్ ఇన్ఫెక్షన్ చేసి రిపోర్ట్‌ను ఇచ్చేందుకు రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. భూ సర్వే రిపోర్ట్ఇవ్వడానికి నిందితులు మొదట రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేయగా, బేరసారాల తర్వాత రూ.20 లక్షలకు ఓకే చెప్పారు.
తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి సూచనల మేరకు సోమవారం సర్వేయర్ శ్రీనివాసులు తహసీల్దార్ఆఫీసు సమీపంలోని ఓ హోటల్లో ఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్స్చేసి అదుపులోకి తీసుకున్నారు.
అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి ఆయనను నిందితుడిగా చేర్చి తహసీల్దార్ఆఫీసులో అరెస్టు చేశారు. అక్కడే తనిఖీలు నిర్వహించారు. ఇద్దరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
